ఆ నిందితుడికి, రేవంత్‌కు తేడా లేదు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి 31 నెలలు గడుస్తున్నా బూతులు మాట్లాడటం తప్ప రేవంత్ రెడ్డి ఎలాంటి విషయాలూ నేర్చుకోలేదని ఆయన మండిపడ్డారు.

మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఎలా ఆన్ చేస్తారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేడిగడ్డ గేట్లను మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఆన్ చేయవచ్చనే కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయన ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఇంజినీర్లు సైతం ఈ సాంకేతిక విషయాన్ని స్పష్టంగా వివరించిన తర్వాత కూడా ముఖ్యమంత్రికి సోయి లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం మాత్రమే స్పష్టంగా కనిపించాయని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన ఒక శాడిస్ట్ మాట్లాడినట్టుగానే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అహంకారంతో వ్యవహరించిన హిట్లర్‌కు పట్టిన గతే, పాపం పండిన నాడు రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన నీళ్ల కోసం తమ రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధమే అని హరీశ్ రావు పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరును హరీష్ రావు (Harish Rao) తప్పుపట్టారు. షాబాద్ ఘోరకలిపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారని, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోంమంత్రికి మాత్రం ఇప్పటివరకు స్పందించే తీరిక లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ దారుణమైన హత్య కేసులో నిందితుడి ప్రవర్తనకు, రేవంత్ రెడ్డి ప్రవర్తనకు పెద్ద తేడా ఏమీ లేదని నిన్నటి మాటలను బట్టి అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇంత పెద్ద ఘోరం జరిగి రాష్ట్రం అట్టుడుకుతుంటే, నిన్న మధ్యాహ్నం ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>