లీకేజీలు, వైరింగ్ లోపాలను ముందే కనిపెట్టే సరికొత్త గ్యాడ్జెట్!

కలం, వెబ్ డెస్క్ : స్మార్ట్‌ ఫోన్‌కు సులభంగా కనెక్ట్ చేసుకునే అత్యాధునిక ‘ఫ్లూక్ ఐసీ’ థర్మల్ కెమెరా (Fluke iSee Thermal Camera) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మన కంటికి కనిపించని ఉష్ణోగ్రత వైవిధ్యాలను ఈ కెమెరా రంగుల రూపంలో స్క్రీన్‌పై చూపిస్తుంది. ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాలను ఎరుపు, పసుపు రంగుల్లోనూ, చల్లగా ఉన్న ప్రదేశాలను నీలం, ఊదా రంగుల్లోనూ ఇది స్పష్టంగా ప్రదర్శిస్తుంది. ఈ సాంకేతికత ద్వారా ఇళ్లలో లేదా కార్యాలయాల్లో గోడలను పగలగొట్టాల్సిన అవసరం లేకుండానే లోపల ఉన్న పైప్ లీకేజీలను, విద్యుత్ వైరింగ్ లోపాలను, ఓవర్ హీటింగ్ సమస్యలను ముందే గుర్తించవచ్చు.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఉన్న టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘సురక్ష 2026’ ప్రదర్శనలో ఈ వినూత్న పరికరాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సందర్శకులను ఈ కెమెరా (Fluke iSee Thermal Camera) విశేషంగా ఆకట్టుకుంది. మార్కెట్లో ఈ ఫ్లూక్ ఐసీ థర్మల్ కెమెరా ధర సుమారు రూ.28 వేలుగా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. గృహ అవసరాలతో పాటు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

Read Also: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆన్‌లైన్ టికెట్లపై రైల్వే కీలక సూచనలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>