గద్వాల జిల్లా ఆసుపత్రిలో స్ట్రెచర్ల కొరత

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల్ (Gadwal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచర్లను మందుల బాక్సులు, వైద్య సామగ్రిని మోయడానికి వాడుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగుల అవసరాలకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తరలించడానికి ఉపయోగించాల్సిన వీటిని.. ఇతర పనులకు వాడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ​రోగులను వీల్ చైర్ల మీద తరలించాల్సిన సహాయకులు ఎవరూ కనిపించడం లేదు.

దీంతో, రోగుల బందువులే వీల్ చైర్లు తెచ్చుకుని వార్డుల్లోకి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఆసుపత్రిలో స్ట్రెచర్ల కొరత ఇప్పటికే తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఉన్నవాటిని రోగులకే అందుబాటులో ఉంచాలని బంధువులు ఆసుపత్రి అధికారులను కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>