ఎర్రకోటకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ ఢిల్లీ

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట (Red Fort) కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ముంబై కంట్రోల్​ రూమ్​ కు ఫోన్​ చేసిన ఆగంతకుడు ఎర్రకోటను పేల్చివేస్తానని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది సందర్శకులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

అనంతరం ఎర్రకోట (Red Fort) ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఎలాంటి బాంబ్​ లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపులు (Bomb Threat) బూటకమని నిర్ధారించిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి గురించి విచారణ మొదలుపెట్టారు.

అయితే, ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో వాహనంతో జరిగిన అత్యంత శక్తివంతమైన ఐఈడీ పేలుడులో 15 మంది మరణించి, డజనుకు పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషాదం జరిగిన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ ప్రజల్లు ఉలిక్కిపడ్డారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: వియ‌త్నాంలో బోటు బోల్తా.. ఏపీ వాసులు మృతి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>