కలం, వెబ్ డెస్క్ : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా యూటర్న్ తీసుకున్నారు. తాను సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనని చెప్పినట్లు తెలిపారు. కానీ వేరే చోట పోటీ చేయనని అనలేదని వెల్లడించారు. శనివారం మీడియా చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌కు వెళ్తే తన భార్య నిర్మల కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను మాత్రం మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అయితే తాను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పార్టీ ఆదేశిస్తే సిద్ధిపేటలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమని వ్యాఖ్యానించారు.

