కలం, వెబ్ డెస్క్ : పాము అనగానే విషంతో పాటు భయం మాత్రమే మనకు ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే, కొన్ని పాము జాతులు శతృవు నుంచి తప్పించుకోవడానికి విషప్రయోగమే కాకుండా నటిస్తాయి కూడా. దీనికి రుజువు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో. ఓ పామును పట్టుకున్న వ్యక్తి నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు నటించింది (Snake Acting). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హోంగు అనే జాతి పామును ఓ వ్యక్తి పట్టుకుంటాడు.
అయితే, ఆ పాము చనిపోయినట్లు నటిస్తూ నోరు తెరిచి, కళ్లు మూసుకుని ఉంటుంది. కాసేపటికే లేచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ ఆ వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించగా చనిపోయినట్లు నటించడం వీడియోలో కనిపిస్తుంది. పాము నటనను చూసిన నెటిజన్లు వాహ్ కమల్ హాసన్ యాక్టింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, హోంగు జాతి పాములు తమను తాము రక్షించుకునేందుకు ఇలా నటిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
పాము మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్!
-ఓ వ్యక్తి పామును పట్టుకోవడంతో అతడి నుంచి తప్పించుకునేందుకు ఆ పాము చనిపోయినట్లు నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Snake ‘Mind-Blowing Acting’ Video Goes Viral as It Feigns Death to Escape#ViralVideo #SnakeActing #PlayingDead #SnakeViralVideo… pic.twitter.com/ZNtRhFWRpz— Kalam Daily (@kalamtelugu) July 10, 2026

