కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA)కు వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్డులో పాతబస్తీ వాసులు భారీ ర్యాలీ చేపట్టారు. హైడ్రా గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా బస్తీవాసులు పాల్గొన్నారు. హైడ్రా నుంచి తమ బస్తీని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఇటీవల హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ వద్ద పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాల పరిధిలో ఉన్న కాలనీలు, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇండ్లను కూడా కూల్చివేస్తారని భయపడుతున్నారు. ఈ సందర్భంగా హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో టాలీవుడ్ హీరో!
Follow Us On: X(Twitter)

