కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ ( US Iran Conflict) దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఇరాన్ ధీటుగా జవాభిస్తోంది. సరిహద్దుల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తోంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు తెగబడింది.
ఈ మేరకు జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై 10 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. దీంతో ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ క్రమంలోనే అమెరికా తన దూకుడును కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అమెరికా దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా మద్ధతిస్తే యూఏఈ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. ఆ దేశం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
అయితే తొలుత ఇరాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 170కి పైగా స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. దీనికి బదులిస్తూ ఇరాన్ కూడా అదే స్థాయిలో అమెరికాపై విరుచుకుపడుతోంది. తమ స్థావరాలను దెబ్బతిస్తున్న ఇరాన్ పై భీకర దాడులు చేసేందుకు అమెరికా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం (US Iran Conflict) ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చమురు, నిత్యావసర వస్తువల వంటి ధరలు మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది.
Read Also: ప్రధాని మోదీ కామెంట్స్.. భారత్‌లో సోషల్ మీడియా బ్యాన్?
Follow Us On : WhatsApp

