కలం, వెబ్ డెక్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం(Ippatam) గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామంలోని రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేయబడ్డాయి.అప్పట్లో పవన్ కళ్యాణ్ బాధితులను కలిసి ధైర్యం ఇచ్చారు. అదే పర్యటనలో ఇప్పటం గ్రామంలోని వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ “ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని” కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తన మాటను నిలబెట్టుకొని గ్రామానికి వచ్చారు. గ్రామస్థులు, జనసేన కార్యకర్తల ఘన స్వాగతం పలికారు.
అనంతరం పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మ(Nageswaramma)తో భేటీ అయ్యారు. ఆమె భావోద్వేగానికి లోనై,“నాన్నా.. నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి” అని ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేశారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్నవారిని ప్రభావితం చేశాయి. ఆ తర్వాత నాగేశ్వరమ్మ కుటుంబానికి రూ.50వేలు, మనవడికి రూ.లక్ష రూపాయాలు ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ నా బంగారం, నాకు దేవుడు. ఆయన సీఎం కావాలి” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: ఫస్ట్ మ్యాచ్‌లోనే ఉతికారేసిన వైభవ్.. రికార్డ్ సృష్టించాడు..
Follow Us On : WhatsApp


