Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా తగ్గిన వెండి.. పెరిగిన బంగారం ధరలు

కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పు (Gold – Silver Rates) చోటుచేసుకుంది. వెండి ధర గురువారం భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఏకంగా రూ.10,000 తగ్గి ప్రస్తుతం రూ.2,35,000గా ఉంది. బంగారం ధర మాత్రం కాస్త పెరిగింది. బంగారం ధర విషయానికొస్తే.. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,310 పెరిగి రూ.1,44,440గా ఉంది. ఇక ఆభరణాలు చేయించుకునే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,32,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరలు మరికాస్త తగ్గే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే బుధవారం బంగారం, వెండి ధరలు (Gold – Silver Rates) తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 తగ్గి, రూ.1,47,250గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,31,190 వద్ద ఉంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.6,453 భారీగా క్షీణించి, రూ.2,26,555కు చేరింది. బుధవారం ధరలు తుగ్గుముఖం పట్టగా.. అదే బాటలో వెండి సైతం గురువారం భారీగా తగ్గింది. ఇక బంగారం ధర కాస్త పెరిగింది.

Read Also: ఖమ్మంలో రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Read Also: డిజిటల్ వారసులు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>