కలం, వెబ్ డెస్క్: చాలామందికి మరణం అంటే ఒకింత భయం ఉంటుంది. కానీ జగిత్యాలకు చెందిన ఈ 80 ఏళ్ల వృద్ధుడు మరణం భయాన్ని అధిగమించాడు. బతికుండగానే సమాధి (Tomb) నిర్మించుకున్నాడు. తన భార్య సమాధి పక్కనే తన సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. జగిత్యాల (Jagtial) జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన రెండు సంవత్సరాల క్రితం సమాధిని నిర్మించారు. సమాధిని సంతాప సూచకంగా చూడకుండా విశ్రాంతి స్థలంగా భావిస్తున్నాడు.
కొంతమందికి సమాధికి అంటే ఓ చిన్నచూపు ఉంటుంది. ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ జగిత్యాల(Jagtial) చెందిన ఇంద్రయ్య (Indraiah) మాత్రం భారీగానే ఖర్చు పెట్టాడు. ఇందుకోసం 12 లక్షలు ఖర్చుచేసి పాలరాతి మార్చుబ్‌తో సుందరంగా నిర్మించుకున్నాడు. ఆయన ప్రతిరోజు పరిసరాలను శుభ్రం చేస్తాడు. అక్కడ ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ‘‘ నేను వృత్తిరీత్యా బిల్డర్. గ్రామంలో ఇళ్లు, స్కూళ్లు కట్టాను. నేను నా సొంత సమాధిని నిర్మించుకోవడం ఆనందంగా ఉంది, జీవితం చాలా చిన్నది. ఏదీ శాశ్వతం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే సమాధిని నిర్మించుకున్నా‘‘ అని అన్నారాయన.
Read Also: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మూడు విమానాలు రద్దు
Follow Us On: Instagram


