కలం వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం(Ippatam) గ్రామంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటంలో జనసేన (Jana Sena) నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఇప్పటంలో పర్యటించిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అధికారంలోకి వచ్చాక మళ్లీ తప్పకుండా ఇక్కడికి వస్తానని హామీ ఇచ్చారు. స్థానిక వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మకు తన ఇంటికి వస్తానని మాటిచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ ఇంటికి జనసేన నాయకులు క్యూ కట్టారు. స్థానిక నేతల ఆధిపత్య పోరుతో తగాదా మొదలైంది. ఆగ్రహానికి గురైన నాయకులు, కార్యకర్తలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని శాంతింపజేశారు. పవన్ కల్యాణ్ రాకకు ముందు గొడవ జరగడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.
Read Also: ఫారెస్ట్ అధికారులకు పవన్ వార్నింగ్.. కారణమిదే!
Follow Us On: X(Twitter)


