Mobile Popup Ad
Mobile Popup Ad

మెడికల్ బోర్డు కోసం పోరుబాట.. ఈనెల 20 నుంచి కవిత నిరాహార దీక్ష!

కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి సంస్థలో నిలిచిపోయిన మెడికల్‌ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20 నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 (PVK5) భూగర్భ గనిని సందర్శించిన ఆమె, గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు.

​కార్మికుల సంక్షేమం, వారి హక్కుల రక్షణ కోసం సింగరేణిలో మెడికల్‌ బోర్డు ఏర్పాటు ఎంతైనా అవసరమని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఆమె (TRS Chief Kavitha) డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

Read Also: ఖమ్మంలో రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Read Also: డిజిటల్ వారసులు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>