Mobile Popup Ad
Mobile Popup Ad

AI అనంతమైనది.. మన బుర్రలు చిన్నవి: ఆర్జీవీ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ‘మానవ మేధస్సు చాలా పరిమితమైనది, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం అనంతమైనది’ అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మన ఫోన్లలో ఎన్నో యాప్స్ ఉన్నప్పటికీ, మన అవసరాలకు తగ్గట్టుగా కొన్నింటిని మాత్రమే వాడుకుంటున్నామన్నారు. ఏఐ టెక్నాలజీ కూడా అలాగే ఉండిపోతుందని అభిప్రాయపడ్డారు. ఏఐని పూర్తిగా ఉపయోగించుకునే అంతటి కెపాసిటీ, మానసిక పరిణతి ప్రస్తుతానికి మనకు లేవన్నారు. మనం కొన్ని పరిమితులకు లోబడే ఆలోచిస్తామని వర్మ పేర్కొన్నారు. ఏఐ అపారమైన వేగంతో దూసుకుపోతుంటే, దాన్ని అర్థం చేసుకోవడంలోనూ మనుషులు వెనుకబడిపోతున్నారని పేర్కొన్నారు. ఏఐ హద్దులు చాలా పెద్దవని ఆర్జీవీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>