Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లిపై నిధి అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇటీవ‌ల రాజా సాబ్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ (Nidhi Agarwal) త‌న పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. తిరుప‌తిలో ఓ మొబైల్ కంపెనీకి సంబంధించిన ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నిధి అగ‌ర్వాల్ కార్య‌క్ర‌మం అనంత‌రం మీడియాతో మాట్లాడింది. పెళ్లి ఎప్పుడు అని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న త‌ర్వాతే తిరుప‌తికి వ‌స్తాన‌ని చెప్పింది. దీంతో నిధి త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే త‌న‌కు ఇంకా న‌చ్చిన వ్య‌క్తి దొర‌క‌లేద‌ని, ప్ర‌స్తుతం మంచి సంబంధం కోసం వెతుకుతున్నామ‌ని చెప్పింది.

త‌న‌కు సౌత్‌లోని అబ్బాయినే పెళ్లి చేసుకోవాల‌ని ఉంద‌ని నిధి త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టింది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోన‌ని కూడా చెప్పింది. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ రెండు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రో రెండు బ‌డా తెలుగు సినిమాల‌కు కూడా ఒప్పుకున్న‌ట్లు తెలిపింది. వాటి వివ‌రాలు ఇప్పుడే చెప్ప‌లేన‌ని, త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 17న మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>