కలం వెబ్ డెస్క్ : దేశంలో తెల్లవారుజామున పొగమంచుతో పలుచోట్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ఎయిర్పోర్టు(Airport)ల్లో విమానాల(Flights) రద్దుతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. తాజాగా బుధవారం శంషాబాద్(Shamshabad)లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి వెళ్లాల్సిన మూడు విమానాలను అధికారులు రద్దు చేశారు. వారణాసి(Varanasi)లో తీవ్ర పొగమంచు ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రద్దయిన విమానాల్లో రెండు ఇండిగో(Indigo)కు చెందినవి కాగా, ఒకటి ఎయిరిండియా(Air India) ఎక్స్ప్రెస్కు చెందినది.. ఇదే కారణంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వారణాసికి చేరాల్సిన మరికొన్ని విమానాలు కూడా రద్దయినట్లు అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport)లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు సంబంధిత ఎయిర్లైన్స్ ప్రయాణికులకు సమాచారం అందించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
Read Also: నింగిలోకి దూసుకెళ్లిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉప గ్రహం!
Follow Us On: Instagram


