epaper
Monday, March 2, 2026
epaper

నింగిలోకి దూసుకెళ్లిన‌ బ్లూ బ‌ర్డ్ బ్లాక్ 2 ఉప గ్ర‌హం!

క‌లం వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. బుధవారం ఉదయం ఇస్రో శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌ LVM3-M6 ద్వారా బ్లూ బర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని(BlueBird Satellite) విజయవంతంగా అంత‌రిక్షం(Space)లోకి పంపించింది. ఉదయం 8.55 గంటలకు నిర్ణీత సమయానికి ప్రయోగం జరగగా, ఉపగ్రహం కక్ష్యలో సజావుగా స్థిరపడినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాకు చెందిన ఏఎస్టీ(AST) స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన ఈ ఉపగ్రహం సమాచార మార్పిడి, పరిశోధన, భవిష్యత్ అంతరిక్ష అవసరాలకు ఉపయోగపడనుంది.

ఈ ప్ర‌యోగంతో ఇస్రో చ‌రిత్ర‌లో అత్యంత భారీ ఉపగ్ర‌హాన్ని అంత‌రిక్షంలోకి పంపి స‌రికొత్త రికార్డు సృష్టించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉప గ్ర‌హం(BlueBird Satellite) బ‌రువు 6,100 కిలోలు ఉండ‌గా, గ‌తంలో 4000 కిలోల‌కుపైగా బ‌రువున్న‌ ఉప‌గ్రహాన్ని నింగిలోకి పంపించారు. బ్లూ బ‌ర్డ్ బ్లాక్ ఉప గ్ర‌హానికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవ‌లు అందించే సామ‌ర్థ్యం ఉంది. 4జీ, 5జీ, వాయిస్‌, వీడియో కాల్స్, మెసేజ్‌లు, వీడియో ప్ర‌సారాల కోసం ఈ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించారు. వాణిజ్య‌, ప్ర‌భుత్వ యాప్‌ల‌కు స‌పోర్ట్ చేసే విధంగా దీన్ని రూపొందించారు.

Read Also: అంకారాలో కుప్ప‌కూలిన విమానం.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!