కలం, వెబ్ డెస్క్: ఏసీ రైలు కోచ్ క్యాబిన్‌ను శృంగార ప్రదేశంగా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాబిన్ అంతా పూలు, బెలూన్లు, గులాబీ రేకులతో నిండిపోయింది. కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ (Honeymoon on Wheels) కోసం అలంకరించిన ఈ ప్రైవేట్ ఏసీ కూపేను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. సాధారణ రైలు కంపార్ట్‌మెంట్‌కి భిన్నంగా ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల బెలూన్‌లను వేలాడదీశారు. అలాగే లైట్లు, కొవ్వొత్తులు, తాజా పూలు, లవ్ యూ అనే బోర్డుతో మరింత అందంగా మార్చారు. సాధారణంగా రెండు బర్త్‌లను లాక్ చేసుకునే వీలుండే ఈ ప్రైవేట్ కూపే.. ప్రయాణికులకు ఎక్కువ ప్రైవసీని అందిస్తుంది. చాలామంది ప్రయాణికులు పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఇతర వ్యక్తిగత వేడుకల కోసం ఇలాంటి స్థలాలను తమకు నచ్చినట్లుగా మార్చుకుంటూ ఉంటారు.
కదిలే రైలులో హనీమూన్ (Honeymoon on Wheels) తరహాలో ఉన్న ఈ అలంకరణ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది. చాలామంది దీనిని బాలీవుడ్ సినిమా సీన్‌తో పోల్చారు. ఈ వినూత్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన కొందరు నెటిజన్లు దీనిని సరదాగా “హనీమూన్ ఆన్ వీల్స్” (Honeymoon on Wheels) అని పిలిచారు. అయితే, రైల్వే లోపల ఇలాంటి మార్పులు చేయడానికి అనుమతి ఉందా అని కొందరు ప్రశ్నించారు. కొవ్వొత్తుల వాడకం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు మరికొందరు.
“హనీమూన్ ఆన్ వీల్స్!”
-ఏసీ రైలు కోచ్ క్యాబిన్‌ను ‘హనీమూన్ రూమ్’గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
-‘రైలు హనీమూన్’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
“Honeymoon on Wheels” Video Inside AC Train Cabin Sparks Safety Debate Online#IndianRailways #HoneymoonOnWheels… pic.twitter.com/fOhMyNLQRr— Kalam Daily (@kalamtelugu) July 8, 2026
Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?
Follow Us On : WhatsApp

