Mobile Popup Ad
Mobile Popup Ad

అఖిలప్రియ Vs గంగుల.. ఆళ్లగడ్డలో హైటెన్షన్

కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda) పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారింది. అహోబిలం తలనీలాల టెండర్ల వ్యవహారం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya), వైసీపీ నేత గంగుల బిజేంద్ర రెడ్డి అలియాస్ నాని మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అహోబిలం తలనీలాల టెండర్ల విషయంలో అఖిలప్రియ అక్రమాలకు పాల్పడుతున్నారని గంగుల ఆరోపిస్తున్నారు. టెండర్ల కేటాయింపులో పారదర్శకత లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ముడుపులు అందలేకపోవడం వల్లే ఇటీవల తలనీలాల తరలింపును అడ్డుకున్నారని బిజేంద్ర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. అక్రమాలు జరిగాయని చెబితే వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని బిజేంద్ర రెడ్డికి సవాల్ విసిరారు. అహోబిలం రావాలని ఆమె ఛాలెంజ్ విసిరిన అఖిల ప్రియ.. ఆరోపణలు రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అఖిల ప్రియ అహోబిలానికి (Ahobilam) వచ్చారు. బిజేంద్రరెడ్డి చర్చలకు రాకపోతే.. ఆయన ఇంటికి వెళ్లేందుకు అఖిల ప్రియ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అవినీతి ఆరోపణలపై కట్టుబడి ఉన్నట్లు గంగుల బిజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు.  ఇరు వర్గాల నేతలు సవాళ్లు ప్రతిసవాళ్తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే అఖిల ప్రియ అహోబిళం బయలు దేరగ.. గంగుల కూడా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఇరువురిని అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ఆళ్లగడ్డ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also: రావణ్‌కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు: కొడాలి నాని

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>