కలం వెబ్ డెస్క్ : టర్కీ రాజధాని అంకారా(Ankara)కు సమీపంలో జరిగిన విమాన ప్రమాదం(Plane Crash)లో లిబియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్(Libyan Army Chief) మొహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో నలుగురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు, ముగ్గురు సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం అంకారా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. విమానంలో ఉన్న అందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు టర్కీ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని వెల్లడించారు. లిబియా ప్రధాని ఈ విషాదకర ఘటన దేశానికి ఇది తీరని నష్టమని పేర్కొన్నారు. దేశానికి నిబద్ధతతో సేవలందించిన కీలక నేతలను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో భూసేనల అధిపతి(Libyan Army Chief), మిలిటరీ తయారీ సంస్థ అధికారి, ఆర్మీ చీఫ్ సలహాదారుడు, అలాగే ఒక సైనిక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. లిబియా సైనిక బృందం టర్కీతో రక్షణ సహకారంపై ఉన్నత స్థాయి చర్చల కోసం అంకారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో లిబియాలో ప్రభుత్వం మూడు రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, వేడుకలు కూడా రద్దు చేశారు.
Read Also: రాహుల్ వర్సెస్ ప్రియాంకాగాంధీ
Follow Us On: Youtube


