కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రైతులు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) కొనియాడారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ పాలనకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనితా రెడ్డి, మీడియా సెల్ సీజే బెనార్, డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ జనరల్ సెక్రటరీ రాములు యాదవ్, దోమ పరమేశ్, మహేందర్, గొనేల శ్రీనివాస్, పసుల రాజు, డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: బెంగళూరు నడిరోడ్డుపై తాచుపాము కలకలం.. వాహనదారులు పరార్
Follow Us On: Instagram

