కలం వెబ్ డెస్క్ : పంజాగుట్ట(Panjagutta)లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు(road accident) ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని ర్యాపిడో డ్రైవర్(Rapido driver)గా గుర్తించారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


