కలం, నిర్మల్ : దిలావర్పూర్ (Dilawarpur) మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన దేవర సారంగపాణి అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్(Nirmal) ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అవసరమైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెక్కు మంజూరు చేయించడంలో సహకరించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

