Mobile Popup Ad
Mobile Popup Ad

ఆయనకు 50 అఫైర్స్ ఉన్నా వదిలిపెట్టను.. బాలీవుడ్ నటుడి భార్య కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఓ రియాలిటీ షోలో నటుడు గోవిందా (Govinda) భార్య సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి శిల్పా షిండే (Shilpa Shinde), సునీతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనిపై సునీత స్పందిస్తూ.. ఇతరులను జడ్జ్ చేసే ముందు తన స్థానంలో ఉండి ఆలోచించాలని, తాను ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. ‘ఆయన నా భర్త.. ఒకవేళ ఆయనకు 10 మందితో అఫైర్స్ ఉన్నా నేను అతడిని వదిలిపెట్టను, చావు వరకు ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత కూడా శిల్పా షిండే తనను టార్గెట్ చేయడంపై సునీత మరో కంటెస్టెంట్ రామ్ కపూర్‌తో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ.. ‘ఆయన నా భర్త, నేను ఆయన భార్యను. ఒకవేళ ఆయనకు 50 అఫైర్స్ ఉన్నా మీకేంటి నష్టం?’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం నటుడు గోవిందా భార్య కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Read Also: ఇక పట్టుకునే బాధలుండవ్.. ఫాలో అయ్యే గొడుగు ఇదిగో!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>