Mobile Popup Ad
Mobile Popup Ad

కొడుకు హిమాన్షుకు గాయం.. స్పందించిన కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : కుమారుడు హిమాన్షు గాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన హిమాన్షు ( Himanshu) ఆరోగ్యంపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. హిమాన్షుకు స్వల్ప గాయం మాత్రమే అయిందని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందన్నారు. కొద్ది రోజుల్లోనే హిమాన్షు కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాన్షు ఆరోగ్యంపై ఫోన్లు, మెసేజ్ లు చేసి తమ కుటుంబంపై ప్రేమను చాటిన ప్రతిఒక్కరికి ధన్యావాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, కేటీఆర్ కుమారుడు హిమాన్షు నిన్న (సోమవారం) సాయంత్రం ఆట సమయంలో గాయం అయింది. దీంతో అతన్ని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మనవడికి గాయం అయిన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి హిమన్షును పరామర్శించారు. మనవడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Read Also: డ్రగ్స్ స్మగర్ల ఆస్తులు జప్తు: డీజీపీ సీవీ ఆనంద్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>