Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో ఘనంగా చొల్లేటి బుచ్చిరెడ్డి పదవీ విరమణ సన్మాన సభ

కలం, కరీంనగర్ బ్యూరో: నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన చొల్లేటి బుచ్చిరెడ్డి (Cholleti Buchi Reddy) సన్మాన సభ కరీంనగర్‌ (Karimnagar) లోని వీ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. చొల్లేటి బుచ్చిరెడ్డి (Cholleti Buchi Reddy) ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారని, వారి సేవా తపనకు, నిజాయితీకి, మానవీయ విలువలకు పదవీ విరమణ ఉండదన్నారు. పదవీ విరమణ వేడుకలో తల్లిదండ్రులు, బంధువులను సంప్రదాయబద్ధంగా సన్మానించడం ద్వారా కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన ఆదర్శ వ్యక్తిగా నిలిచారని కొనియాడారు.

జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరిగేషన్ ఇంజనీర్ కేవలం కాలువలు నిర్మించే అధికారి కాదని, రైతు ఆశలను సాకారం చేసి వేలాది కుటుంబాల జీవితాల్లో సంతోషాన్ని నింపే మహోన్నత శిల్పి అని అన్నారు. డాక్టర్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే, ఇరిగేషన్ ఇంజనీర్ వేలాది రైతు కుటుంబాల జీవనాధారాన్ని కాపాడుతాడని పేర్కొన్నారు. చొల్లేటి బుచ్చిరెడ్డి.. సౌమ్య స్వభావి, ఆజాతశత్రువు, కల్మషం లేని వ్యక్తిగా ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, పదవీ విరమణ ఉద్యోగానికే తప్ప వారి సేవలకు, వ్యక్తిత్వానికి కాదని, వారి జీవితం ప్రతి ఉద్యోగికి ఆదర్శమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, కన్వీనర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపెళ్లి కాళీచరణ్ గౌడ్, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, గంగారపు రమేష్, సర్దార్ హరిమేందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, మామిడి రమేష్, దేవానంద్, సమరసేన్, అభినవ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పోలు కిషన్ నాగరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read Also: కాఫీతో మైగ్రేన్ తగ్గుతుందా? పెరుగుతుందా? నిపుణులు చెప్పిన నిజాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>