కలం, వెబ్ డెస్క్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (France President Emmanuel Macron)కు పెను ప్రమాదం తప్పింది. సిరియా పర్యటనలో ఆయన బస చేసిన డమాస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ సమయంలో మెక్రాన్ అధికారిక సమావేశాల కోసం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వరుస పేలుళ్లతో సిరియాలో హైఅలర్ట్ ప్రకటించారు.
అయితే, ఈ పేలుడు వల్ల మెక్రాన్ (France President) కు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పేలుళ్లలో నలుగురు మరణించినట్లు, మరికొందరు గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే మృతుల సంఖ్యపై అధికారిక ధృవీకరణ కోసం అధికారులు దర్యాప్తు చేపట్టారు. పేలుళ్లకు గల కారణాలు, వాటి వెనుక ఉన్నవారిపై కూడా ఇంటలిజెన్స్ వర్గాలు విచారణ కొనసాగిస్తోంది.
Read Also: గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా? ఆరోగ్యానికి జరిగే ప్రమాదాలు ఇవే!
Follow Us On : WhatsApp

