Mobile Popup Ad
Mobile Popup Ad

అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని మైత్రి నగర్‌లో ముడా నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న మైత్రి యూత్ అసోసియేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే యువత చురుకైన భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో యువత ముందుండాలని, వారి శక్తిని సరైన దిశలో వినియోగిస్తే నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం యువత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి యూత్ అసోసియేషన్ భవనాలు యువతకు ఉపయోగకరంగా మారతాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ల పాండురంగారెడ్డి, రమేష్ బాబు, ఎస్. శేఖర్, మైత్రి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసులు, కార్యదర్శి మైత్రి యాదయ్య, నాయకులు ప్రశాంత్, అబ్దుల్ హక్, కృష్ణ కుమార్ రెడ్డి, తుప్పలి ఆంజనేయులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఎముకలు ఎందుకు బలహీనపడతాయి? ప్రధాన కారణాలు ఇవే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>