కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad Road Accident)లో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ డిపో సమీపంలో విజయవాడ హైవేలోని భాగ్యలత – హయత్‌నగర్ మార్గంలో ముందు వెళ్తున్న కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో హయత్‌నగర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

