కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుడు (Retired Teacher) మల్లయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మల్లయ్య ఆత్మహత్యకు ముందు 20 పేజీల సూసైడ్ నోట్ రాసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనాస్థలం నుంచి 20 పేజీల సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. మల్లయ్య ఆత్మహత్యకు గల కారణాలు, సూసైడ్ నోట్‌లో ఉన్న వివరాలు, ఇతర అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

