Mobile Popup Ad
Mobile Popup Ad

కామారెడ్డి గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బీర్కూరులోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల(Birkur Gurukul), జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన కలకలం రేపింది. భోజనం చేసిన అనంతరం 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు వారికి చికిత్స అందించారు. ఆసుపత్రికి చేరుకున్న సర్పంచ్ ధర్మతేజ విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

Read Also: తెలంగాణ టీ20లో మెరిసిన నిర్మల్ యువ క్రికెటర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>