Mobile Popup Ad
Mobile Popup Ad

అయోధ్య ట్రస్ట్ కీలక నిర్ణయాలు

కలం, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya)లోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విరాళాల చోరీ అంశం సహా పలు అంశాలను చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ట్రస్ట్.. కొత్త జనరల్ సెక్రటరీగా కృష్ణమోహన్‌ను నియమించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతోనే విరాళాల చోరీ కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించిన ట్రస్ట్.. ఆ స్థానంలో కృష్ణమోహన్‌ను తాత్కాలికంగా నియమించింది. ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాకు అంగీకారం తెలిపింది.

ఘోర తప్పిదం జరిగిపోయింది..

అయోధ్యలో (Ayodhya) రాముడి ఆలయానికి వచ్చిన విరాళాల్లో చోరీ జరగడంతో ఘోర తప్పిదం జరిగిపోయిందని ట్రస్ట్ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోశాధికారి గోవింద్ కన్నీరు పెట్టుకున్నారు. చోరీకి గురైన వస్తువులను గుర్తించామన్నారు. నగదు మాత్రమే కాకుండా, వస్తువులు కూడా చోరీకి గురైనట్లు వివరించారు. ఈ నెల 22న ట్రస్ట్ బోర్డ్ మరోసారి సమావేశం కానుంది.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>