Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలం పట్టణానికి 15 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) పట్టణాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 15 నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సోమవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..

​పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ, మెడికల్ కాలనీ, ఐటీడీఏ రోడ్, సెయింట్ పాల్స్ స్కూల్, వెంకటేశ్వర కాలనీ, రాజుపేట కాలనీల్లో తీవ్రమైన లో-వోల్టేజ్ ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, యుద్ధప్రాతిపదికన 15 నూతన ట్రాన్స్‌ఫార్మర్లను బిగించారు. ​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెరగబోయే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ముందే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>