కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఓ మహిళా హోంగార్డు (Woman Home Guard) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. విషయం తెలియగానే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళా హోంగార్డును వెంటనే ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On: Instagram

