మణుగూరులో యాంటీ రేబిస్ టీకాల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పట్టణంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పశువైద్య అధికారిణి డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ.. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులు మరీ ముఖ్యంగా ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు, పిల్లులకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబిస్ టీకా వేయించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ సరస్వతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెంపుడు జంతువులకు టీకాలు వేయించారు.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>