Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి అర్హుడి ఓటును పరిరక్షించాలి: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) సూచించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సు జరిగింది. జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిఓటు విలువైనదని, ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బీఎల్ఏలు నిరంతరం బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి బూత్‌లోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు (Voter) పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ బూత్ పరిధిలోని పార్టీ మద్దతుదారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, వారి ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రజా మద్దతుతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నొక్కి చెప్పారు. ఈసారి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత బలంగా, సంస్థాగతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీలు కొండూరు భవాని పవన్ కుమార్, రవి నాయక్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, మాజీ అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, మాజీ జడ్పీటీసీలు జంగిటి నర్సింహా, మాస భాస్కర్, మాజీ ఎంపీటీసీ ఎరుకల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ఎస్ఐర్ కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, సర్పంచ్‌లు కసారపు శ్వేత శ్రీనివాస్, యాచారం యాదిగౌడ్‌ పాల్గొన్నారు.

Read Also: గులాబీ తోటలో బావబామ్మర్దుల పొలిటికల్ ఫైట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>