Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ‘సర్’.. లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (Telangana SIR) ప్రక్రియ సజావుగా సాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గణాంకాలు రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 3,06,21,142 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో 90.52 శాతం ఎన్యూమరేషన్ ఫామ్ (EFs) పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు ఇప్పటివరకు 26,38,708 ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేసినట్లుపేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 7.80 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ జిల్లాల్లో 100 శాతం ఫారాల పంపిణీ..

రాష్ట్రంలోని నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో బీఎల్వోలు 100 శాతం ఫారాల పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 34.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో 27.91 శాతం డిజిటైజేషన్ పూర్తవ్వగా.. నల్గొండలో 23.44 శాతం ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేశారు.

ఖమ్మంలో 20.90 శాతం డిజిటైజేషన్ నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరిలో డిజిటైజేషన్ కేవలం 1.08 శాతం మాత్రమే అయింది. రంగారెడ్డిలో 2.48 శాతం, వికారాబాద్‌లో 2.67 శాతం డిజిటైజేషన్ పూర్తి అయింది. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా.. 71.14 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి అయింది. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. 87.35 శాతం ఫారాల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>