కలం, వెబ్ డెస్క్: తిరుపతిలో వైభవంగా జరిగిన ‘లెనిన్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు అఖిల్ సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘జులై టెన్త్ వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు’ అంటూ నాగార్జున మాస్ డైలాగ్‌తో స్టేజ్ పైనే భారీ హైప్ క్రియేట్ చేశాడు. దీంతో అక్కినేని అభిమానుల ఉత్సాహం నెలకొంది. తండ్రి నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహం, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన సెంటిమెంట్‌ను కూడా నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ‘లెనిన్’ సినిమా కథ అంతా శ్రీరామపురం నేపథ్యంలో సాగుతుందన్నారు. తన తండ్రి ఏఎన్నార్ పుట్టిన ఊరు కూడా శ్రీరామపురమే కావడంతో ఈ ప్రాంతం అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. ఈ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని, అఖిల్‌కు ఈ చిత్రం మైల్ స్టోన్‌గా నిలుస్తుందన్నారు.

