కలం, నిర్మల్ : సోన్ మండలం సాకెరా గ్రామంలో భీమన్న దేవుని గజాల ఊరేగింపు (Bhimanna Devuni Jatara) ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. పవిత్ర గంగ స్నానానికి తీసుకెళ్లే ముందు గజాలను గ్రామంలోని ప్రతి ఇంటికి భాజాబజంత్రీలు, సాంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజాలకు స్వాగతం పలికారు.
మహిళలు గజాలకు పసుపు, కుంకుమలు సమర్పించి భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం గంగ స్నానం, సోమవారం భీమన్న జాతర మహోత్సవం జరుగుతుందని నాయక్‌పోడ్ కులస్తులు తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించగా, ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Read Also: నిర్మల్‌లో ఘనంగా ఆర్ఎస్ఎస్ గురుపూజ మహోత్సవం
Follow Us On: Instagram

