కలం, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లా పాడేరు (Paderu) ఏజెన్సీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ వైర్లు, చెట్లు కూలిపోతున్నాయి. పెదబయలు మండలం కీముడుపల్లి లో ఓ ఇంటి పై భారీ వృక్షం కూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
మరోవైపు పాడేరు మండలం బూరుగు చెట్టు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నిన్నటి నుంచి పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు విద్యుత్ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పెదబాయలు మండలం రాయిమామిడి దగ్గరి వాగు ఉప్పొంగి ప్రవాహిస్తోంది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

