కలం, సినిమా : నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఇప్పటివరకు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న ఆయన.. రేపు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. రేపు ఉదయం 10:11 గంటలకు కళ్యాణ్ రామ్ తన తొలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. రేపు (జూలై 5) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఘన స్వాగతం పలకాలని షైన్ స్క్రీన్స్ కోరింది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌తో (Venkatesh) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది. ఇక నుంచి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అలాగే వ్యక్తిగత విశేషాలను నేరుగా అభిమానులతో పంచుకోనున్నారు.

