కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School)గా ఎంపిక కాగా శనివారం రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విస్తీర్ణం, తరగతి గదులు, ల్యాబ్స్, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో రాష్ట్ర అధికారుల బృందం సభ్యులు ఎస్ఈ బాల ప్రసాద్, డిప్యూటీ ఈవో శివ కుమార్, ఎంఈఓ సుంకోజు భాస్కర్, ఏఈ అమరేందర్ రెడ్డి, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు.. సీఎస్ కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

