Mobile Popup Ad
Mobile Popup Ad

టమాటతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా వాడితే అద్భుత ప్రయోజనాలు

కలం, వెబ్ డెస్క్: ఈ కాలపు యువత చర్మ సౌందర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా పలు రకాల కారణాలు చర్మ సమస్యలకు కారణం అవుతున్నాయి. పింపుల్స్, నల్ల మచ్చలు, యువతలో వృద్ధాప్య ఛాయలు ఇలా చాలా రకాల సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు టమాట బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. టమాటతో తయారుచేసే కొన్ని రకాల హోమ్ రెమిడీస్ (Tomato Home Remedies) ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల మచ్చలకు చెక్

యువతలో చాలామంది ఎదుర్కొనే సమస్య నల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్. వీటిని తొలగించేందుకు టమాట గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్నచోట అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది.

ట్యాన్‌ను పోగొట్టేందుకు

చర్మంపై పేరుకుపోయిన ట్యాన్‌ను పోగొట్టడంలో టమాట గుజ్జు చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనికోసం టమాట గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం పై ఏర్పడిన ట్యాన్ తొలగిపోతుందట.

ముఖ రంధ్రాలు మటుమాయం

ముఖంపై ఏర్పడిన రంధ్రాలను పోగొట్టేందుకు టమాట చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం టమాట రసంలో కొన్ని పాలు కలిపి చర్మానికి మర్దనా చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన ముఖంపై ఏర్పడిన రంధ్రాలు మూసుకుపోతాయని చెబుతున్నారు నిపుణులు.

మొటిమలకు చెక్

టమాటలో ఉండే విటమిన్ సి, ఎ, సహజ ఆమ్లాలు మొటిమలను, వాటి మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. దీనికోసం టమాట రసంలో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు.

యవ్వనమైన చర్మం కోసం

చర్మంపై ముడతలు తగ్గించి యవ్వనంగా ఉంచేందుకు టమాట చాలా బాగా పనిచేస్తుందట. దీనికోసం టమాట రసంలో విటమిన్ E క్యాప్సూల్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కుంటే చర్మం యవ్వనంగా మారుతుందని తెలిపారు.

సన్ బర్న్

సన్ బర్న్, ఎర్ర మచ్చలు తగ్గించేందుకు టమాట అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం కొద్దిగా టమాట రసం తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. పావు గంట తర్వాత మంచి నీటితో కడుక్కుంటే ఎర్రమచ్చలు తగ్గుతయాని చెబుతున్నారు నిపుణులు.

మృతకణాలు పోయేందుకు

చర్మాన్ని మృదువుగా మార్చి మృతకణాలు తొలగించడంలో టమాట ఉపయోగపడుతుంది. దీనికోసం టమాట గుజ్జులో కద్దిగా చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. దీనివవల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

జిడ్డు చర్మానికి

ఈ సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. చర్మం పై జిడ్డును తొలగించేందుకు టమాట రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ లిక్విడ్‌ను కాటన్ ప్యాడ్ సహాయంతో ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఈ చిట్కా జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా సహాయపడుతుంది.

Read Also: ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. మెట్రోలో పుస్తకాల యుద్ధం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>