Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటీటీలో ‘పెద్ది’ జోరు.. స్ట్రీమింగ్ డేట్ లాక్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కించిన బిగ్గెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదలైన 35 రోజులకే (5 వారాల థియేట్రికల్ విండో) డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘పెద్ది’ (Peddi), రామ్ చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు సనా దర్శకత్వం, ఏఆర్ రెహమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్ వెర్షన్‌లో భారీ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. ఓటీటీ వెర్షన్‌లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: అలర్ట్.. వాట్సాప్‌లో ఈ లింక్ అస్సలు క్లిక్ చేయొద్దు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>