ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కరీంనగర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Centre) మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఫ్యాక్స్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డిలతో కలిసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు స్థానికులు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నగర మేయర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని, గన్నీ బ్యాగులు, టార్పలిన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే మిల్లుకు తరలించే విధంగా తగిన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నగునూరు సర్పంచ్ శ్రావణి-మహేందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>