సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఉద్యమ రోజులను నెమరువేసుకున్న కేటీఆర్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా 15 ఏళ్ల క్రితం చేపట్టిన ఆరు రోజుల పాదయాత్ర ఒక మధుర జ్ఞాపకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు 2011 నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు ఈ పాదయాత్ర సాగినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

వికారాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ వరకు కొనసాగిందని తెలిపారు. సబ్బండ వర్గాల సంపూర్ణ మద్దతుతో ఆనాటి పాదయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగిందని పేర్కొంటూ కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>