కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ లో యూజర్ నేమ్ విధానంపై వివాదాలు కొనసాగుతున్న వేళ తాజాగా ఆ యాప్ లో ఓ సైబర్ మోసం (WhatsApp Scam ) తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ‘ఎయిర్‌టెల్ గ్రోత్’ పేరుతో బ్లూ టిక్ అకౌంట్ నుంచి వాట్సాప్ యూజర్లకు మేసేజ్ లు వస్తున్నాయి. “100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్” క్లైమ్ చేయండి అంటూ వస్తున్న ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే సంగతి అని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లి .. తద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలను దొంగలిస్తారని అంటున్నారు.
నిజానికి అధికారిక ఎయిర్‌టెల్ లింక్ ఎప్పుడూ http://airtel.inతోనే ఉంటుందని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఇలాంటి భారీ ఆఫర్లను వాట్సాప్ లింక్ ల ద్వారా ప్రచారం చేయవని గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఏదైనా ఆఫర్ నిజమా అని http://airtel.in లేదా Airtel Thanks యాప్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి అకౌంట్ల పట్ల వాట్సాప్ లో రిపోర్ట్, బ్లాక్ చేయాలంటున్నారు.

