పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా: సర్పంచ్ రాము

కలం, సోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అందిస్తున్న చేయూత పింఛన్లు (Cheyutha Pension) పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తున్నాయని కడ్తాల్ సర్పంచ్ గుర్రం రాము అన్నారు. మంగళవారం సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన పేదలకు పింఛన్లు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయ తస్కిన్, వార్డు సభ్యులు ప్రసాద్, శిల్వన్, మాజీ ఉపసర్పంచ్ సాయిరాం, నాయకులు గంగన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>