Mobile Popup Ad
Mobile Popup Ad

క‌రీంన‌గ‌ర్‌లో ముగిసిన హోంగార్డుల రొటేషన్ బదిలీలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుల వార్షిక రొటేషన్ బదిలీల (Home Guard Rotation Transfers) ప్రక్రియ అత్యంత విజయవంతంగా, నూటికి నూరు శాతం పారదర్శకంగా ముగిసిందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం (CP Gaush Alam) ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల జూన్ 25న తాము ప్రకటించిన శాస్త్రీయ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కమిషనరేట్ అస్త్ర సమావేశ మందిరంలో నిర్వహించిన బదిలీల ముగింపు కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ, సిబ్బందిలో జవాబుదారీతనం, సమానత్వం పెంచేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం ఈ వార్షిక రొటేషన్ విధానాన్ని అమలు చేసినట్లు వివరించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక మినహాయింపులు పొందిన (వితంతు మహిళలు, తీవ్ర అనారోగ్య బాధితులు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారు, జూన్ 2027 లోపు పదవీ విరమణ చేయనున్న వారు) హోంగార్డుల అర్హత జాబితాను అందరి సమక్షంలో హాల్లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. అనంతరం మిగిలిన సిబ్బందికి పూర్తి నిష్పాక్షికంగా అందరి సమక్షంలో లాటరీ ద్వారా పారదర్శకంగా బదిలీ స్థానాలను ఖరారు చేశారు. హోంగార్డుల కమాండెంట్ వెంకటేశ్వర్లు స్వయంగా హాజరై ఈ బదిలీల ప్రక్రియను పర్యవేక్షించారు.

ఈ వార్షిక బదిలీల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 373 మంది హోంగార్డులు బదిలీ అయ్యారు.

బదిలీల పూర్తి వివరాలు:

సిరిసిల్ల నుండి కరీంనగర్ – 50
కరీంనగర్ నుండి సిరిసిల్ల – 52
జగిత్యాల నుండి కరీంనగర్ – 56
కరీంనగర్ నుండి జగిత్యాల – 56
కరీంనగర్ నుండి రామగుండం – 13
రామగుండం నుండి కరీంనగర్ – 13
కరీంనగర్ నుండి భూపాలపల్లి – 3
భూపాలపల్లి నుండి కరీంనగర్ – 4
సిరిసిల్ల నుండి వరంగల్ – 2
వరంగల్ నుండి కరీంనగర్ – 14
కరీంనగర్ నుండి వరంగల్ – 12
రామగుండం నుండి భూపాలపల్లి – 25
భూపాలపల్లి నుండి రామగుండం – 25
జగిత్యాల నుండి రామగుండం – 17
రామగుండం నుండి జగిత్యాల – 17
సిద్ధిపేట నుండి కరీంనగర్ – 7
కరీంనగర్ నుండి సిద్ధిపేట – 7
మొత్తం బదిలీలు: 373

ఈ అధికారిక కార్యక్రమంలో హోంగార్డుల కమాండెంట్ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వేణుగోపాల్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, కిరణ్, ఇతర పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>