కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం తల్వేద గ్రామ శివారులో ఇటీవల నూతనంగా ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ (BJP) నూతన కార్యాలయాన్ని గంగోత్రి, నారాయణ మఠం పీఠాధిపతి ఆచార్య రామానుజ దాస్ (Acharya Ramanuja Das) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయ అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆచార్య రామానుజ దాస్‌కు సన్మానం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

